సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నామని ఐటీడీఏ పీవో ప్రతీ జైన్ వెల్లడించారు.పదో తరగతి విద్యార్థులువంద శాతం ఫలితాలను సాధించేందుకు వీలుగా నూరు రోజుల ప్రణాళికను అమలు చేయనున్నట్లు వివరించారు.గురువారం డీడీ మణెమ్మ, ఏసీఎంవో రమణయ్యతో కలిసి తన కార్యాలయంలో సమీక్షని ర్వహించారు. భద్రాచలం ఐటీడీఏలో గణితం,సాంఘిక శాస్త్రం పుస్తకాలను తయారు చేస్తున్నారని అన్ని సబ్జెక్టులు అందుబాటులోకి వచ్చాక వంద రోజుల ప్రణాళిక పాటించనున్నట్లు చెప్పారు. ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ అవకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేస్తున్న పీవో ప్రతీక్ జైన్ స్థాయి ర్యాంకులు సాధించేలా కృషి చేయాలన్నారు. డిసెంబరు చివరికల్లా సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రచార వాహనం ప్రారంభం: విద్య హెల్ప్లైన్ అనే కెరీర్ గైడెన్స్ ప్రచార వాహనాన్ని పీవోతో కలిసి డీడీ ప్రారంభించారు. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు 18 వరకు ఈ ప్రచారం కొనసాగుతుందని తెలిపారు.
[zombify_post]