భద్రాచలం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.14.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. భద్రాచలం, చర్ల,దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలలో ఈ నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. భద్రాచలం పట్టణంలో పలు అభివృద్ధిపనులకు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. వీటిని పట్టణంలో చర్ల రోడ్ నుంచి కూనవరం రోడ్ వరకు రూ.2.60 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులు చేపట్టనున్నారు. కొత్త మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు రూ.1.30 కోట్ల నిధులు, వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైన్లను రూ.1.10 కోట్లతో పూర్తి చేయనున్నారు.నియోజకవర్గంలో వాజేడు,రూ.6 కోట్లతో వెంకటాపురం మండలాలకు వివిధ అభివృద్ధి పనులు, చర్ల మండలంలో రూ.1.50 కోట్లు దుమ్ముగూడేనికి రూ.2. కోట్లు చొప్పున ఖర్చు చేయనున్నారు.
[zombify_post]