పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దామని అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ పిలుపునిచ్చారు.రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలపై రూపొందించిన పోస్టర్‌ను అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ గురువారం సాయంత్రం కలెక్టరేట్ ఆవిష్కరించారు. అధికారులకు మట్టి గణేష్ ప్రతిమలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ….పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టి ఎస్ పి సి బి) పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఏటా పంపిణీ చేస్తోందని, ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 2000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలర్స్, కెమికల్స్‌తో చేసిన విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీవ్రంగా నష్టం జరుగుతోందన్నారు. చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణహిత ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మండపాల్లో, ఇండ్లలోనూ పర్యావరణహిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి, పూజించాలని కోరారు. తద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మట్టి గణపతులను నిమజ్జనం చేయడం ద్వారా కలుషితమయ్యే నీటిని నివారించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస చారి, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాం రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఇంజనీర్ విరేశ్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]