బొంతురాజేశ్వరరావు ను కలిసిన చెల్లుబోయినశ్రీనివాస్
శ్రీనివాస్,బొంతును కలవటంలో అంతరంగం ఎమిటి
రాజోలు అసెంబ్లీ టికెట్ జనసేనపార్టీ కే దాదాపు ఖరారు

బొంతురాజేశ్వరరావును తెరమీదకు తెచ్చే ప్రయత్నం శ్రీనివాస్ చేస్తున్నారా
రాజోలు అన్ని అసెంబ్లీ కంటే రాజోలు నియోజకవర్గం సెపరేట్.. ఎందుకంటే ఎక్కువ వార్తల్లో నిలిచే నియోజకవర్గం రాజోలు.. గత ఎన్నికల్లో కూడా ఒకే ఒక అసెంబ్లీ జనసేన గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం రాజోలు.. అలాంటి నియోజకవర్గంలో రాజకీయ రసపుట్టుగా సాగుతాది..గత ఎన్నికల్లో టిడిపి, వైఎస్ఆర్సిపి, జనసేన వేర్వేరుగా పోటీ చేశాయి.. వైసీపీ నుంచి బొంతు రాజేశ్వరరావు.. టిడిపిపార్టీ నుంచి గొల్లపల్లి సూర్యరావు, జనసేన పార్టీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు బరిలో నిలిచారు.. వారావారి పోరులో జనసేనపార్టీ రాజోలు అసెంబ్లీ సీటు కైవసం చేసుకుంది.. ముగ్గుల అభ్యర్థులు గట్టి పోటీలో నిలవడంతో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు 814 ఓట్లతో గెలుపొందారు.. అనంతరం రాపాక వైసీపీ పంచకు చేరారు.. అప్పుడు వైసిపి అభ్యర్థిగా పోటీచేసిన బొంతురాజేశ్వరరావు ఎమ్మెల్యే రాపాక వైసీపీకి మద్దతు ఇవ్వడంతో రాజేశ్వరరావు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు.. దాదాపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ రాపాక వరప్రసాదరావు కి ఖరారు అయినట్లు సమాచారం.. ఇప్పుడు ఇరుపార్టీల అభ్యర్థి సస్పెన్స్ గా మారింది.. టిడిపి-జనసేన ఖరారు కావటంతో రాజోలులో టిడిపి ఉండకపోవచ్చు.. పొత్తులో భాగంగా ఈ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారు.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావును వేరే అసెంబ్లీకి పంపించే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఇక్కడ జనసేనపార్టీ టికెట్ చాలా మంది ఆశిస్తున్నారు.. అందులో ముందువరుసలో గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాపాకరమేష్ బాబు, తాడి మోహన్ ముందు నుంచి పార్టీ కి సేవలు అందిస్తున్నారు.. నియోజవర్గంలో కీలక నేతలుగా పనిచేస్తున్నారు.. అనూహ్య పరిణామాల నడుమ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడును వైఎస్సార్ సీపీ లో జగన్ సమక్షంలో చేర్పించారు.. ఆయన కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ నేపథ్యంలో బొంతు రాజేశ్వరరావు వైసీపీని వీడి జనసేన చేరడం జరిగింది.. దిండి గ్రామానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ కూడా జనసేన టికెట్ ఆశిస్తున్నారు.. ఇప్పుడు బొంతును చెల్లుబోయినశ్రీనివాస్ కలవటం నియోజవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. బొంతు రాజేశ్వరరావు కి జనసేన టికెట్ ఖరారు అయిందంటూ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.. బొంతు గత ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పోలయ్యారు.. ఆ సానుభూతి గెలుపుకు సహాయపడుతుందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.. దీనికి తోడు టిడిపి ఓట్ బ్యాంకు కూడా కలిసి రావడంతో గెలుపు సాధ్యమేనని అభిప్రాయం పడుతున్నారు.. దీనితోడు శ్రీనివాసు ముందుగానే బొంతులు కలవడం చర్చినిమైంది.. టిడిపి అధిష్టానం నుంచి ముందుగానే శ్రీనివాస్ కి తెలిపిన అంటూ నియోజవర్గ స్థాయి నాయకులు అభిప్రాయపడుతున్నారు… ఏదిఏమైనా రెండు పార్టీలు కలవడం జనసేన గెలుపుకు సులువని మేధావులు అభిప్రాయం…
[zombify_post]