డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కల్సి పోటీ చేయ్యడమనేది ఆనందదాయకమని తెలుగుదేశం పార్టీ రాజోలు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి తాడి మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు మల్కీపురంలో తాడి మోహన్ బాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తే వైఎస్సార్సీపీకి సీట్లు గల్లంతు అవ్వడం ఖాయమన్నారు. ఐతే ఎస్సీ నియోజకవర్గాలలో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించాలని తాడి మోహన్ బాబు ఈ సందర్భంగా రెండు పార్టీలను కోరుతున్నట్లు తెలిపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనతో విసిగిపోయిన ఎస్సీ ఎస్టీ వర్గాలు చాలా వరకూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుచూపుతున్నాయని మోహన్ బాబు తెలిపారు. చంద్రబాబు నాయుడ్ని అక్రమంగా అరెస్ట్ చేయ్యడం సరికాదనే భావన మిగిలిన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా బలంగా ఉందన్నారు. దళిత సంక్షేమ పథకాలకు నామం పెట్టిన వైఎస్సార్సీపీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి దళితులు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు పై అక్రమంగా బనాయించిన కేసులు ఎంతోకాలం నిలబడవని అధర్మం పై ధర్మం తప్పక విజయం సాధిస్తుందని మోహన్ బాబు తాడి ఆశాభావం వ్యక్తం చేశారు.
[zombify_post]
