విశాఖ. టిడిపి-జనసేన పొత్తుపై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటన లో స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ రాజకీయల్లో ఈ రోజు మరిచిపోలేని రోజుగా పేర్కొన్నారు.ఇంతకాలం ఉన్న అనుమానాలు,సందేహాలు పటాపంచలు అయ్యాయన్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన వైసీపీకి చరమగీతం పలకడానికి నాంధిగా ఉందని ఈసందర్భంగా ఆయన అన్నారు.
[zombify_post]