జగిత్యాల జిల్లా
అంగన్వాడి కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తింపు తో పాటు 26 వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతూ పలు డిమాండ్లతో ఈరోజు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అంగనవాడి టీచర్లు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ప్రతినెల 26 వేల రూపాయల జీతం ఇవ్వాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తింపు కల్పించాలని దీంతో పాటు తాము రాజ్యాంగబద్ధంగా కోరుకున్న కోరికలను నెరవేర్చాలని నిరాహార దీక్ష చేపడుతున్నామని, అయితే ప్రభుత్వం మాత్రం తాము సమ్మెలో ఉంటే అంగనవాడి రూమ్ల వద్దకు వెళ్లి తాళాలు పగలగొట్టుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు, ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి అంగన్వాడి కేంద్రాలను నడిపిస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా తమ డిమాండ్లను నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు అన్నారు. కోరుట్ల పట్టణంలోని పలు వీధులలో ఈరోజు రాలి నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు.
[zombify_post]