in , ,

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా 15న నిరసన ర్యాలీ

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను ఆయన అభిమానులు తీవ్రంగా ఖండించారు. బుధవారం సతుపల్లి మునిసిపాలిటీలోని మాధురీ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్రమ అరెస్ట్కు నిరసనగా ఈనెల 15వ తేదీన మాధురీ ఫంక్షన్ హాల్ నుంచి పట్టణంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించనున్నట్లు అభిమానులు తీర్మానించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా చంద్రబాబు అభిమానులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్పర్సన్ కూసంపూడి మహేష్, నాయకులు కొత్తూరు ప్రభాకరరావు, చలసాని సాంబశివరావు, డాక్టర్ కూసంపూడి నరసింహారావు, మట్టా ప్రసాద్, నరుకుళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

జామి: చెరువులో గుంబూషియా చేపలు విడుదల

రాజకీయ వేధింపు కేసులు సరికాదు: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర