డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఇదివరకు ఏ ప్రభుత్వం ఇవ్వని రీతిలో తమ ప్రభుత్వం మహిళలకు అగ్రస్థానం కల్పించిందని బిసి సంక్షేమ, సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్ గా యనమదల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అధ్యక్షత వహించిన చిర్ల మాట్లాడతూ మునిపెన్నడు లేని విధంగా మార్కెట్ కమిటీలో మహిళలకు రిజర్వేషన్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు గతంలో పెద్దగా నామినేటెడ్ పోస్టులు దక్కేవి కాదని తమ ప్రభుత్వ హయాంలో పక్కాగా అందరికీ దక్కుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ చేయని రీతిలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అమ్మబడి కింద విద్యార్థులు ఉన్న తల్లి పేరుతో నగదు జమ చేస్తున్నారని పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ముఖ్యమంత్రి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాడు అనడానికి యనమదల ఒక ఉదాహరణని అన్నారు. మంత్రి వేణుగోపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి సామాజిక న్యాయం పాటిస్తూ అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా గొల్లపల్లి డేవిడ్ రాజ్, నియోజకవర్గంలో ఎమ్మెల్యే తరువాతి స్థానాలైన మార్కెట్ కమిటీ చైర్మన్లుగా రెడ్డి రవిదేవి చంటి, యణమదల నాగేశ్వరరావులను నియమించడం జరిగింది అని, మన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యులకు అందిన ఈ సముచిత స్థానాన్ని మీకు అందినట్టు భావించి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియచేశారు.
ఎన్నికల ముందు ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే సాహసం చేశారంటే కోర్టులు, జడ్జీలు కూడా అవినీతిని నిర్ధారించే రిమాండ్ విధించారని, ఎక్కడా కూడా చంద్రబాబు అవినీతి జరగలేదని చెప్పడం లేదు అని,
పైగా ఒక కొత్త స్లోగన్ ఇచుకుంటున్నారని "తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా" అని చెప్తున్నారని తెలిసింది అని ఎద్దేవా చేశారు.
ఇలా ప్రతీది మర్చిపోయే నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం లేదని,
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించడంలో ఎస్సి, ఎస్టీ, బీసీ వర్గాలకు జగన్ పెద్దపీట వేస్తున్నారని,
సంక్షేమ పథకాలలో అవినీతి లేకుండా తీర్చిదిద్దాలని సీఎం పట్టుదలతో పనిచేస్తున్నారని ఆయన బాటలో నిలిచి మంచి సేవలందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి,అడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజ్, డీసీఎంఎస్ చైర్మన్ శాఖ మణికుమారి ప్రసన్నకుమార్, మండల వైకాపా కన్వీనర్ తమ్మన శ్రీనివాసు, ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి (దొరబాబు), చల్లా ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]