రాజమండ్రి జైలులో చంద్రబాబుకు రక్షణ లేదని మాజీ హోం మంత్రి చినరాజప్ప ఆరోపించారు. జైలు సూపరింటెండెంట్ను బదిలీ చేస్తున్నామంటూ వైసీపీ నేతలు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. జైలును కూడా జగన్ తన కంట్రోల్లోకి తీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ పరిణామాల పట్ల రాజ్యాంగ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిలో ఎన్ఎస్ఓ కమాండోలకు గాయాలయ్యాయని గుర్తు చేశారు.
[zombify_post]