మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవని, ఒక వేల ఇచ్చినట్లయితే వాహన యజమాని పై కేసు నమోదు చేస్తామని రుద్రంగి ఎస్ఐ రాజేష్ హెచ్చరించారు. మంగళవారం రుద్రంగి మండలకేంద్రంలో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణ కోసమే పోలీసులు పని చేస్తున్నారని, వాహనదారులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించవద్దని అన్నారు. సరైన వాహన పత్రాలు కలిగి ఉండాలని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు.

[zombify_post]