లావేరు మండలం బుడతవలస గ్రామ సచివాలయం పరిధిలో ఇటీవల మంజురైనా కొత్త పింఛన్లను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సచివాలయంలో 'కార్యకర్తలతో ఎమ్మెల్యే కిరణన్న ఆత్మీయ కలయిక' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
[zombify_post]