భారీ వర్షం.. నీట మునిగిన రోడ్లు
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కస్పా వీధిలో వర్షం పడితే చాలు వర్షం నీరు రోడ్డు మీద నదిలా ప్రవహిస్తోంది. సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. ఈ సమస్య పై ఎన్ని సార్లు ప్రజాప్రతినిధులకు, నగర పంచాయతీ సిబ్బందికి తెలియజేసిన పట్టించుకునే పరిస్థితి లేదని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
[zombify_post]
