సాలూరు మండలంలోని పలు గ్రామాలతో పాటు ఏజెన్సీలో భారీగా వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.వివరాలు ఇలా ఉన్నాయి. గత మూడు రోజులుగా మండలంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, సోమవారం సాయంత్రం మండలంలోని మామిడిపల్లి నుండి ఏజెన్సీ వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. మామిడిపల్లి, మరిపల్లి, గంగన్నదొర వలస, కురుకూటి తదితర గ్రామాల్లో వర్షం కారణంగా నీరు రోడ్లపై పారింది.
[zombify_post]