- సిద్దిపేట డిపో నుండి గుర్తు తెలియని వ్యక్తి బస్ ను దొంగిలించి అక్కడినుండి వేములవాడకు చేరుకొని బస్టాండ్ హైదరాబాద్ పాయింట్ లో పార్క్ చేసి హైదరాబాద్ ఈ బస్సు వెళుతుందని లో కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని అక్కడ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా కొందరు ప్యాసింజర్ టికెట్ తీసుకోమని డ్రైవర్ నీ అడగగా మార్గ మధ్యలో కండక్టర్ వస్తాడని అతను టికెట్ తీసుకుంటారని చెప్పిన బస్ దొంగ. తంగళ్లపల్లి మండలం సారంపెల్లి – నేరెళ్ల గ్రామ శివారు మార్గం మధ్యలో బస్సులో డీజిల్ అయిపోవడంతో బస్సును, ప్రయాణికులను మార్గ మధ్యలో దించేసి ఈ బస్ లో డీజిల్ అయిపోయిందని మీరు వేరే బస్ ఎక్కి పోవాలని చెప్పాడు. చేసేది ఏమీ లేక ప్రయాణికులు వేరే బస్ వెళ్ళిపోయారు. వదిలేసి పోయిన బస్ ఆరా తీయగా ఆ బస్ సిద్దిపేట డిపో కి చెందినదిగా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
[zombify_post]