కోసిగి మండలం పరిధి లో వందగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆగస్టు నెల 30 వ తేదీన కర్నూల్ ఔట్ డోర్ స్టేడియం లో నిర్వహించిన కర్నూల్ జిల్లా జంప్ రోప్ ఎంపిక పోటీలలో సబ్ జనియర్ బాలుర విభాగంలో 5 వ తరగతి చదువుతున్న సంతోష్ కుమార్, బాలికల విభాగంలో 5వ తరగతి చదువుతున్న కీర్తన, 6వ తరగతి చదువుతున్న శిరీష, గీతాంజలి, 8 వ తరగతి షర్మిల ఎంపిక అయ్యి ఈ నెల 9, 10 తేదీలలో గుంటూరు జిల్లా తెనాలి లో జరిగిన రాష్ట్రస్థాయి జంప్ రోప్ క్రీడా పోటీలలో పాల్గోన్నారు. ఈ పోటీలలో కీర్తన, గీతాంజలి కాంస్య పతకాలు సాధించగా, సంతోష్ కుమార్ రజత పతకం సాధించడం జరిగిందని, తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి లో రానించడం గర్వంగా ఉంది అని ప్రధానోపాధ్యాయుడు ఎన్. గోవింద రాజు తెలియజేశారు. విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించారు.
[zombify_post]
