– అధ్యక్షురాలు ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ – బలరాం రెడ్డి
ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన ఆరోగ్య సమితి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఎంపీపీ ముత్యాల కరుణ శ్రీ – బలరాంరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నాడు జన ఆరోగ్య సమితి సమావేశాన్ని నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి చేయవలసిన పనుల గురించి మరియు పేషెంట్లకు సంబంధించిన ఎటువంటి సేవలు చేయవలసి ఉంటుంది ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నివారణ కోసం చేయవలసిన మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని, డాక్టర్ అనుదీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎండి సలాముద్దీన్ మేడారం ఎంపిటిసి మిట్ట తిరుపతి మేడారం సర్పంచ్ సామంతులు జానకి శంకర్ కటికనపల్లి సర్పంచ్ కారుపాకల రాజయ్య కొత్తూరు సర్పంచ్ తాళ్ల మల్లేశం గౌడ్ వైద్య అధికారులు డాక్టర్ అనుదీప్ డాక్టర్ గౌతమ్ మరియు పి హెచ్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
[zombify_post]