- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి వనిత చిట్యాల ఐలమ్మ 38 వర్ధంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని అన్నారు. ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలంలో ఐలమ్మ కనబరిచిన ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. వివక్షను ఎదురిస్తూ సాగిన నాటి ఆమె పోరాట స్ఫూర్తి, తెలంగాణ సాధన ఉద్యమంలో ఇమిడి ఉన్నదని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతల్ ఠాణ పోచమ్మ ,జిల్లా అధికార ప్రతినిధి పొన్నాల శ్రీనివాస్ ,జిల్లా ఉపాధ్యక్షులు తెలంగాణ శ్రీనివాస్ , జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి తాడూరు పద్మ, మండల అధ్యక్షులు బి.పి.రామ్, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి రవీందర్, యూత్ అధ్యక్షులు పున్ని సంపత్, సిరికొండ మల్లయ్య, బాలయ్య, పొన్నాల కవిత ,సుద్దాల బిక్షపతి, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]