కరీంనగర్ జిల్లా# *ఏఎఫ్ బి పార్టీలోకి కటక మృత్యుంజయం*
కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కటుకం మృత్యుంజయం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు.
కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు లోపాయి కార ఒప్పందంతో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ రెండు రోజుల క్రితమే బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. బిజెపి పార్టీలో ఎన్నికలలో డివిజన్లకు నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఉండి అభ్యర్థులను గెలిపించడంలో ముఖ్య పాత్రను పోషించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి మాజీ ఎమ్మెల్యే గా, కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా జిల్లాలో పాటిని పటిష్టపరిచారు. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ పార్టీల ఆదివారం రోజున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి గారు , కటకం మృత్యుంజయం గారు కలకత్తా వెళ్లారు. ఏఐఎఫ్ బి జాతీయ కార్యదర్శి దేవ రాజన్ ను కలిసి సంప్రదింపులు జరిపారు. అనంతరం బండ సురేందర్ రెడ్డి గారి నేతృత్వంలో జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ గారు మృత్యుంజయం గారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తూ కీలక ప్రకటన చేశారు. దీంతో మారుతున్న రాజకీయ సమీకరణాలకు మృత్యుంజయం చేరిక హాట్ టాపిక్ గా మారింది.
బండారి శేఖర్
ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
కరీంనగర్
[zombify_post]