వివాహిత అదృశ్యం.. పోలీస్ కేసు నమోదు
పొలాకి మండలం మల్లపేట గ్రామానికి చెందిన చంద్రుడు తన భార్య జి. రేవతమ్మ(31) గత నెల 28న ఇంటినుంచి పనిమీద బయటకువెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదని శనివారం పోలాకి స్టేషన్కు ఫిర్యాదు ఇచ్చాడని ఎస్. ఐ. సత్యనారాయణ తెలిపారు. ఇనాళ్లూ బంధువులు స్నేహితుల వద్దకువెళ్లి వెతికినా కనపడకపోవడంతో ఫిర్యాదు ఇచ్చారన్నారు. వివాహమై 9 ఏళ్లు అయినా రేవతికి పిల్లలు లేరు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు.
[zombify_post]