అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం పురుషోత్తపురం గ్రామ వద్ద జాతీయ రహదారిపై విశాఖ వైపు వెళుతున్న టాటా ఐచర్ వాహనంలో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్గం అయింది. ఎలమంచిలి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వచ్చి వాహనాలను వన్ వేకి మళ్లించారు.
[zombify_post]