విజయవాడ కోర్టు వద్ద భారీగా పోలీసులు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో సీఐడీ ఆదివారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అయితే కోర్టు వద్దకు అదనపు పోలీసు బలగాలు చేరుకున్నాయి. అంతేకాకుండా చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధిస్తే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. కోర్టు పరిసరాల నుంచి మీడియా ప్రతినిధులను దూరంగా పంపించేశారు. దీంతో ఉత్కంఠ నెలకొంది.
[zombify_post]