జగిత్యాల జిల్లా
కోరుట్ల శివారులోని మోనార్టీ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న అబ్దుల్ సబ తుల్లా ఇర్ఫాన్ అనే విద్యార్థి కి అతని తండ్రి నిన్న సత్తుపిండి ఇచ్చి వెళ్లాడు,ఇంటి నుండి తెచ్చిన సత్తుపిండి అందరు మిత్రులకు ఇవ్వగా ముగ్గురి వద్దకు వచ్చేసరికి అయిపోయింది, దీంతో తమకు సత్తుపిండి పెట్టలేదని ముగ్గురు విద్యార్థులు ఈ రోజు ఉదయం ఇర్ఫాన్ ను బయటకు తీసుకెళ్లి దాడి చేసారు,తమకు సత్తుపిండి పెట్టలేదని విచక్షణారహితంగా బాలుడిపై పిడిగుద్దులతో దాడి చెయ్యడంతో బాపుకు తీవ్ర గాయాలు అయ్యాయి, విషయం తెలుసుకున్న తండ్రి రాహుఫ్ ఇర్ఫాన్ ను అసుపత్రికి తరలించారు. తన కొడుకును తీవ్రంగా కొట్టారని విచక్షణారహితంగా దాడి చేసారని స్కూల్ లో ఇంత జరుగుతున్న పట్టించుకునే వారు లేరని వాపోయాడు.ముగ్గురు పిల్లలపై పోలిసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు..బాబుకు అయిన గాయాలను చూస్తే తీవ్రంగా కొట్టినట్టు కనిపిస్తుంది..
[zombify_post]