-జిల్లా జడ్జి బి.ఎస్. జరీవన్ కుమార్
-జాతీయ లోక్ అదాలతను ప్రారంభించిన న్యాయమూర్తి
జాతీయ లోక్ అదాలత్ ద్వారా రుణ గ్రహీతల నుండి రుణాలను వసూలు చేసే ప్రక్రియలో సులభ వాయిదాలను ఇవ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ఎస్. జగ్జీవన్ కుమార్ బ్యాంకర్లకు సూచించారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు, కక్షిదారులతో న్యాయమూర్తి లోక్ అదాలత్ ప్రయోజనాలపై చర్చించారు. సులభ వాయిదాలు, వడ్డీ తగ్గింపు అనేవి కక్షిదారులకు లోక్ అదాలత్ ప్రయోజనాలు కాగా, సత్వర పరిష్కారం, వెంటనే కొంత మొత్తం వసూలు కావడం బ్యాంకర్లకు ఉపయుక్తమని న్యాయమూర్తి ఉన్నారు. అనంతరం మూడవ అదనపు జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న బీమా కంపెనీ లోక్ అదాలత్ ను పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో నష్టపోయిన వ్యక్తులను, కుటుంబాలను మానవతా దృక్పదంతో ఆదుకోవాలని, అందుకు అనుగుణంగా నష్ట పరిహారం నిర్ణయంచాలన్నారు. కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి. రాంప్రసాదరావు, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా, లోక్ అదాలత్ సభ్యుడు ఎం. లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]