- ఘనంగా కాళోజీ నారాయణరావు 109వ జయంతి..
- తెలంగాణ అస్తిత్వాన్ని, భాషను, యాసను ఎలుగెత్తి చాటింది కాళోజీ..
- పుట్టుక నీది చావు నీది బతుకంతా సమాజానిదే.
- ఒక సిర చుక్క లక్ష మెదళ్లకు కదలిక..
కాళోజీ నారాయణరావు 109వ జయంతిని పురస్కరించుకొని శ్రీ శ్రీ కళావేదిక సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులు అర్పిస్తూ… కాళోజి జయంతిని ఉద్దేశించి, వేంకట కృష్ణమాచార్యులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని, భాషను, యాసను ఎలుగెత్తి చాటారని, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు.
పోతుగంటి మాట్లాడుతూ నిజాం దమన నీతికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా తన కలాన్ని ఎక్కుపెట్టారని, పుట్టుక నీది చావు నీది బతుకంతా సమాజానిదేనని మరియు ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న కాళోజి మాటలని గుర్తు చేశారు.
హమీద్ ఖాన్ మాట్లాడుతూ సాహిత్యం ప్రజలను చైతన్యం చేస్తుందని అలాంటి మంచి సాహిత్యాన్ని సమాజానికి అందించిన గొప్ప కవి కాళోజీ అని గుర్తు చేశారు.
వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేడు తెలంగాణ యాసకు గౌరవం దక్కడానికి కారకులే కాళోజీ యని, బడి పలుకుల భాష కాదు పలుకు బడుల భాష రావాలని కాళోజి ఆశించేవారని గుర్తు చేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ కాళోజి రాసిన గొడవ మనందరి గొడవగా స్మరించుకునే చక్కని అవకాశం దొరకడం అభినందనీయమన్నారు.
శ్రీశ్రీ కళావేదిక- సూర్యాపేట జిల్లా శాఖ పక్షాన అధ్యక్షులు డా.పోతుగంటి వీరాచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు తూపురాణి వేంకట కృష్ణమాచార్యులు,ప్రధాన కార్యదర్శి శ్రీ లింగాల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి శ్రీమతి పూసోజు పద్మ, భానుపురి సాహితీ వేదిక గౌరవాధ్యక్షులు హమీద్ ఖాన్, తెలుగు భాషా పండితులు గునగంటి వెంకటేశ్వర్లు, వెంకటాచారి, శ్రీనివాసచారి, మదనాచారి, నరసింహాచారి, ఇంద్రారెడ్డి, రాహుల్, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]