వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధన పాటించకుండా ర్యాష్ డ్రైవింగ్తో పట్టుపడితే కఠినచర్యలు తప్పవని దుమ్ముగూడెం ఎస్ఐ గణేష్ తెలిపారు.శుక్రవారం మండలంలోని ములకపాడు సెంటర్లో వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి డ్రైవింగ్ చేస్తున్న యువతను పోలిస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘన చేపడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]