రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో కాళేశ్వరం అదనపు 1.1 టీఎంసీ కాలువ నిర్మాణం లో భాగంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్వాసితులు ఇండ్లు కోల్పోతున్న సందర్భంగా శుక్రవారం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు పిడిఎఫ్ చదివి వినిపించారు
అనంతరం అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ మాట్లాడుతూ జాబితా లో ఎవరి పేరైనా రాని యెడల, వచ్చిన పేరులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల వ్యవధిలో తెలుపాలని నిర్వాసితులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖిమ్య నాయక్, ఆర్డిఓ మధుసూదన్, తహశీల్దార్ పుష్పలత, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ శిరీష, బిఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]