జగిత్యాల జిల్లా కేంద్రంలోని భారత జీవిత బీమా సంస్థ (LIC) కార్యాలయంలో స్వర్ణోత్సవ సంబరాలు ఆడంబరంగా జరిగాయి..జగిత్యాల పట్టణంలో ఎల్ ఐ సి సంస్థ ఏర్పడి నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ముగింపు
ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించారు..ఈ ఉత్సవాల కు
ముఖ్య అతిథిగా సీనియర్ డివిజన్
మేనేజర్ (కరీంనగర్) S.V.ప్రసాద్ రావు,విశిష్ట అతిథిగా మార్కెటింగ్ మేనేజర్ MRK శ్రీనివాస్ లు హాజరయ్యారు.. విశేష సేవలు అందించిన జగిత్యాల
ఎల్ ఐ సి శాఖ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బలరామ కృష్ణ, ధర్మపురి శాఖ బ్రాంచ్ మేనేజర్ ప్రేమ్ సాగర్ రెడ్డి,లతో పాటు,వికాసాధి కారులు,
సిబ్బంది, ఏజంట్ లను వీరు ప్రత్యేకంగా అభినందించారు..
ఈసందర్భంగా
సీనియర్ డివిజన్ మేనేజర్ S.V.ప్రసాద్ రావ్ మాట్లాడుతూ
జీవిత భీమా సంస్థ ప్రభుత్వ అగ్రగామి సంస్థ అని గత 20 ఏండ్లుగా ఎన్నో ప్రయివేట్ సంస్థలు
మార్కెట్ లోకి వచ్చినప్పటికీ ని
పాలీలలో 70 శాతం,ప్రీమియం సేకరణలో 70 శాతం తో పాటు
60 శాతం మార్కెట్ షేరు కలిగివున్న గొప్ప సంస్థ ఎల్ ఐ సి సంస్థ అని ఆయన కొనియాడారు
అనంతరం రిటైర్ సిబ్బంది,ఏజంట్ లు పాలసీదారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు
అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్
సత్యనారాయణ రావ్ వందన సమర్పణతో కార్యక్రమం ముగియగా ఏజెంట్ లు ,సిబ్బంది భారీగా పాల్గొన్నారు
[zombify_post]