in ,

గెస్ట్ లెక్చ‌ర‌ర్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్‌

  • ఎండు డేపాడేరు,  : అల్లూరి జిల్లాలో  వివిద ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఖాళీగా ఉన్న లెక్చ‌ర‌ర్ పోస్టుల‌లో గెస్టు లెక్చ‌ర‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌డానికి అర్హ‌లైన అభ్య‌ర్దుల నుండి ద‌ర‌ఖాస్తులు  ఆహ్వానిస్తున్నామ‌ని జిల్లా  క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ జేసారు.   అర‌కువ్యాలీ ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో  గ‌ణితం 1, బోట‌నీ, షార్టు హాండ్ 1 పోస్టు, ముంచింగ్‌పుట్టు జూనియ‌ర్ క‌ళాశాల‌లో  గ‌ణితం 1, బోట‌నీ 1, దేవీప‌ట్నంలో  తెలుగు స‌బ్జెక్టు 1,  రంప‌చోడ‌వ‌రం  ఎంపిహెచ్ డ‌బ్ల్యూ (ఎఫ్‌) 1, వి.  ఆర్‌. పురంలో  సివిక్స్ 1, చింతూరు  ఫిజిక్స్ 1,కూన‌వ‌రం తెలుగు 1, నెల్లిపాక తెలుగు 1 ,పాడేరు  ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో  ఆంగ్లం 1పోస్టు, ఫిజిక్స్ 1, ఎంపిహెచ్‌డబ్ల్యూ (ఎఫ్‌) 2 పోస్టులు భ‌ర్తీ చేస్తామ‌న్నారు.  ఎం.పి.హెచ్‌. డ‌బ్ల్యూ పోస్టుల‌కు  బి ఎస్సీ న‌ర్సింగ్ విద్యార్హ‌త‌లు క‌లిగి ఉండాల‌ని పేర్కొన్నారు. అతిధి లెక్చ‌ర‌ర్  ఉద్యోగాల‌కు  పోస్ట్‌  గ్రాడ్యుయేష‌న్‌లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులైన అభ్య‌ర్దులు  ఈనెల 22 వ తేదీలో  పాడేరు ఐ.టి. డి. ఏ  ప్రాజెక్టు అధికారి వారి కార్యాల‌యానికి ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాల‌ని  సూచించారు.  ఈనెల 25 వ తేదీన  జిల్లా క‌లెక్ట‌ర్  కార్యాల‌యంలో  ఇంట‌ర్వూలు నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. అర్హ‌త‌లు ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్దులు ద‌ర‌ఖాస్తులు చేయాల‌ని  కోరారు.

[zombify_post]

Report

What do you think?

విద్య, సమాజ సేవా రంగాల్లో చిత్తలూరి అభినందనీయుడు

రెవెన్యూ డివిజన్ కై కదిలిన అఖిలపక్షం నాయకులు.