మిర్యాలగూడ:సెప్టెంబర్ 08 నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలో కృష్ణా పురం వద్ద రోడ్డుపై అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి ఓ ప్రయివేటు బస్సు లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ బస్సు కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినట్లుగా గుర్తించారు. వెనుక టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 26మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది……
[zombify_post]