న్యూస్ టుడే, విశాఖపట్నం : నియోజకవర్గంలో కాలువలు గడ్డల సమస్యలు పరిష్కరించాలని విశాఖ జీవీఎంసీ కమిషనర్ ఛాంబర్ లో సాయి కాంత్ వర్మతో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు భేటీ అయ్యారు. అయన మాట్లాడుతూ హెచ్పిసిఎల్ సంస్థ ఎక్సనషన్ లో భాగంగా హెచ్పీసీఎల్ పబ్లిక్ ఇయర్ రింగులో యాజమాన్యం ధ్వారా రెండు స్ట్రోమ్ డ్రైన్ లు ప్రతిపాదించగా మొదటిది మల్కాపురం డ్రైన్ పూర్తి అయ్యింది అని, రెండవది శ్రీహరిపురం డ్రైన్ ఇది ఎం. ఐ. జి కాలనీ మీదుగా, ఎక్స్ సర్వీస్ మాన్ కాలనీ మీదుగా, శ్రీహరిపురం మార్కెట్, కోరమండల్ మీదుగా గుల్లపురం నుంచి హెచ్పీసీఎల్ ద్వారా సముద్రం లో నీరు వెళ్లే గడ్డని నిర్మించాలని అయన కోరారు. గతంలో దీనికి సంబందించిన DPR తయారయ్యిందని, దినికి సంబంధించి హెచ్పిసిఎల్ సంస్థ నుంచి నిధులు మంజూరు అయ్యేవిధంగా చూసి. సమస్య పరిష్కరించాలని అయన తెలిపారు. అదేవిధంగా ఎన్ ఏ డి నుంచి తారక రామ అపార్ట్మెంట్ వెనకాల నుంచి, కరసా, మర్రిపాలెం శ్యాంనగర్, కంచరపాలెం చాకలి గడ్డ వరకు గల డ్రైన్ కు సంబందించిన సముద్రంలోకి వెళ్లి డ్రైన్ లో చెత్తను వేరు చేసే ఎలక్ట్రికల్ గ్యార్బజ్ మిసినరీ లు ఏర్పాటు చెయ్యాలని అయన కోరడం జరిగింది.
[zombify_post]