1532 కేజీల పిడిఎఫ్ బియ్యం పట్టివేత
కొత్తవలస మండలం మిందివలసలో హనుమాన్ శెట్టి అనే వ్యక్తి అక్రమంగా పిడిఎఫ్ బియ్యం నిల్వలు కలిగి ఉన్నాడనే సమాచారం అందుకున్న విజిలెన్స్ సిఐ సింహాచలం ఆధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ వుంచిన 1532 కేజీల పిడిఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఆయనపై వ్యక్తిగత కేసును నమోదు చేశారు. పట్టుకున్న పిడిఎఫ్ బియ్యాన్ని కొత్తవలస రెవెన్యూ అధికారులకు అప్పగించారు.
[zombify_post]