ఈనెల 10వ తేదీన ఇల్లందులో జరుగు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సత్తుపల్లి ఓబిలో విస్తృత స్థాయిలో కరపత్రాలతో ప్రచారం నిర్వహించి జనరల్ బాడీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య యాక్టివ్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకన్న జి రామయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉన్న సింగరేణి సంస్థల్లో పర్మనెంట్ కార్మికులు పాటు 52 డిపార్ట్మెంట్లలో 25 వేల పైగా కాంట్రాక్ట్ కార్మికుల పని చేస్తున్నారని వీరికి కనీస వేతనాలు గాని చట్టబద్ధ సౌకర్యాలు గాని అమలు చేయలేదని అనేక సంవత్సరాల తరబడి ఆందోళన చేస్తున్న సింగరేణి యాజమాన్యం గాని ప్రభుత్వాలుగాని కాంటాక్ట్ కార్మికుల సమస్యలు పెడచెవిన పెడుతూ ఉన్నారని కోల్ ఇండియాలో జరిగిన ఒప్పందాలను సైతం సింగరేణి యాజమాన్యం అమలు చేయకుండా ఒప్పందలు ఉల్లంఘనకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదని వారు అన్నారు. బొగ్గు పరిశ్రమ యాజమాన్యాలకు కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ కమిటీ వేతన ఒప్పందం జరిగిందని దానిని సింగరేణిలో ఇంతవరకు అమలు చేయలేదని 11వ వేతన ఒప్పందాన్ని బొగ్గు పరిశ్రమలోని కాంట్రాక్ట్ కార్మికులు కూడా వర్తింపజేయాలని కనీసం ఒకటో కేటగిరి వేతనం అయిన అమలు చేయాలని అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నదని ఆయన యాజమాన్యాలు ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులు 25 వేల మంది సింగరేణిలో పనిచేస్తున్నారని వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షతను నిర్లక్ష్యాన్ని ప్రదర్తిస్తున్నదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి భాగస్వామ్యంతో పరిశ్రమగా నడుస్తున్నదని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు లేరని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడుతున్నారని ఎన్నికల సందర్భంలో సింగరేణి పర్యటనలో కెసిఆర్ కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ బానిస వ్యవస్థని తెలంగాణలో బానిస వ్యవస్థ లేకుండా అందర్నీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాల గడుస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వారు అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ ప్రారంభమైనప్పుడు నుంచి కార్మికుల వెంట ఉంటూ హక్కుల కోసం సౌకర్యాల కోసం నిజాయితీగా నిస్వార్ధంగా రాజీలేని కోరును ఐఎఫ్టియు కొనసాగించినదని భవిష్యత్తులో కూడా ఇదే రకమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నదని ఈ క్రమంలోని భవిష్యత్ కార్యాచరణ కోసం సెప్టెంబర్ 10 2023న ఇల్లందులో ప్రకృతిల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర శాసన నిర్వహించబడుతున్నదని ఈ సదస్సుకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు పుల్లయ్య, శరత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు
[zombify_post]