టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సింపతి గేమ్ మొదలు పెట్టారని అరుకు ఎంపీ గొట్టేటి మాధవి విమర్మించారు. చంద్రబాబు అవినీతి సంపదపై ఐటీ నోటీసులు జారీ చేసి నెల రోజులైనా స్పందించని ఆయన ఇప్పుడు తనను అరెస్టు చేస్తారంటా సింపతీ సంపాదించేందుకు మీడియా ముందు గేమ్ మొదలెట్టారన్నారు. చంద్రబాబు మోసపూరిత ప్రకటనలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్సీపీ గెలుపొందడం ఖాయమని, తమ గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. చంద్రబాబు, పవన్ లను జనం నమ్మడం లేదని అన్నారు.
[zombify_post]