in ,

మెడికల్ షాపుల ను తనిఖీ చేసిన అధికారులు

సత్తుపల్లి పట్టణంలో మెడికల్ షాపులను అసిస్టెంట్ డైరెక్టర్ జి ప్రసాద్,  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఇన్స్పెక్టర్లు కే.దేవేందర్ రెడ్డి, సిహెచ్.సంపత్ కుమార్, లు బుధవారం తనిఖీ చేశారు. మత్తు ఇచ్చే మందు బిళ్ళలు, ఇంజక్షన్లు, నిద్ర మాత్రల విక్రయాలకు సంబంధించి బిల్లులు, ప్రస్తుతం ఉన్న స్టాకు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లను పరిశీలించారు. వైద్యులు రాసిన మందుల చీటీ లేకుండా మత్తు ఇచ్చేందుకు వాడే మందులు ఇంజక్షన్లు, నిద్ర మాత్రలు విక్రయించకూడదని మందుల షాపుల యజమానులకు సూచించారు. పరిమితికి మించి స్టాక్ తెప్పించిన సరైన బిల్లులు, వైద్యుల మందుల చీటీలు లేకుండా వీటిని విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా సత్తుపల్లి డివిజన్లో అన్ని మందుల షాపులను అధికారులు తనిఖీ చేశారు.

[zombify_post]

Report

What do you think?

నియోజకవర్గస్థాయి పార్టీ రాజకీయ ప్రతినిధుల మీటింగ్

ఎక్కిన బస్సే.. ప్రాణాలు తీసింది