ఈనెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేలా బిజెపి పై ఒత్తిడి తీసుకువచ్చేలా టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని జూలకంటి నివాసంలో ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు బ్రహ్మారెడ్డిని కలిశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు టిడిపి పార్లమెంట్ సభ్యులు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా నాయకులు గడిపర్తి శ్రీనివాసరావు, రెంటచింతల మండల నాయకులు జొన్నలగడ్డ ఎర్ర వెంకయ్య, రెంటచింతల పట్టణ నాయకులు మరియా బాబు, వెల్దుర్తి మండల ఎంఆర్పిఎస్ ఇంచార్జ్ జక్రయ్య, మండల పార్టీ నాయకులు యాకోబు, కారంపూడి మండలం ఎమ్మార్పీస్ ఇంచార్జ్ జీవరత్నం, దుర్గి మండల నాయకులు కే రమేష్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]