ఈనెల 10న రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకులోయలో పర్యటించనున్నారని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఆదివారం ఉదయం 11 గంటలకు విశాఖ నుంచి హెలికాప్టర్ లో అరుకులోయ చేరుకుంటారన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో రైల్వే అతిథి గృహానికి చేరుకుని, అక్కడ నుంచి పద్మాపురం గార్డెన్, మ్యూజియం సందర్శిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సుంకరమెట్ట కాఫీ తోటలను పరిశీస్తారని తెలిపారు. అక్కడ నుంచి హెలిప్యాడ్ కు చేరుకుని విశాఖ బయలు దేరుతారని పేర్కొన్నారు. గవర్నర్ పర్యటన ను అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని కోరారు.
[zombify_post]