- భారతీయ జనతా పార్టీ లో చేరి మొట్ట మొదటిసారిగా కోనరావుపేట మండలం మారుపాక, సుద్దాల, పల్లిమక్త, నాగారం గ్రామాలకు విచ్చేసిన డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప దంపతులకు మహిళలు, గ్రామ ప్రజలు ,యువత ఘన స్వాగతం పలికారు.అనంతరం వారి స్వగ్రామం నాగారం లో సుమారు 1000 మంది పైగా కార్యకర్తలతో సమావేశం ఏర్పటు చేశారు. చెన్నమనేని వికాస్ మీడియాతో మాట్లాడుతూ రాబోవు రోజుల్లో పార్టీనీ మరింత పటిష్టం చేయాలని అన్నారు. వేములవాడలో కాషాయం జెండా రెప రెపలాడాలని కోరారు. అనంతరం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ నినాదంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు వారితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, పార్లమెంట్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు,నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]