in , , ,

రాజకీయల్లో ప్రత్యేక స్థానం హుజురాబాద్

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2 గా చలామణి అయినా ఈటెల రాజేందర్ అడ్డ ఇది.ఏ ఉప ఎన్నికల్లో కూడా జరగని పోటి హుజూరాబాద్ లో జరిగింది. అలాంటి స్థానంలో గెలవాలంటే తీవ్రంగా వ్యూహలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు అన్ని పార్టీల నేతలు. కానీ అందుకు భిన్నంగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి ఓ వైపు కర్ణాటకలో మోగించిన జయభేరి తెలంగాణలో కూడా కొనసాగించాలని అధిష్టానం ఆలోచిస్తుండగా హుజురాబాద్ లో మాత్రం అంతర్గత కుమ్ములాటలతో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వస్తుందని లోగొట్టు గుస గుస. స్థానికంగా ఉండే నాయకులకే టికెట్ ఇవ్వాలని లోకల్ లీడర్ లు పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన లీడర్ ముందే వాగ్వాదానికి దిగారు. మరోవైపు బలమైన క్యాడర్ కాంగ్రెస్ కు లేకున్నా ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఉన్న ఓటు బ్యాంకుతో గట్టిగా ఐక్యంగా ప్రయత్నిస్తే గెలిచే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ నాయకుల విశ్లేషణ. హుజురాబాద్ ఎన్నికల నామినేషన్ లో కూడా దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి స్థానికంగా ఉన్న నాయకులు జమ్మికుంట పట్టణ చెందిన జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సాయిని రవి,జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక,గూడెపూ  సారంగపాణి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్యాట రమేష్,ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేట్ తౌటం రవీందర్,జమ్మికుంట,హుజురాబాద్ లో విధులు నిర్వహించిన రిటైర్డ్ సిఐ దాసరి భూమయ్య,లింగారెడ్డి,జాలి కమలాకర్ రెడ్డి నామినేషన్ వేశారు.ఏది ఎలా ఉన్నా రాబోయే ఎన్నికల్లో అటు బీఆర్ఎస్,బీజేపీ నుండి కాంగ్రెస్ కు గట్టి పోటి ఉంటుంది.అధిష్టానం హుజురాబాద్ పై ప్రత్యేక చొరవ చూపెట్టి పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క ఇదే స్థానంలో నుండి పాదయాత్ర చేసి అనేక సమస్యలు వెలుగులోకి వెళ్లబుచ్చిన స్థానిక నాయకత్వం దాన్ని సద్వినియోగపరుచుకోవడంలో విఫలమయ్యారు అని చెప్పుకోవాలి.స్థానికంగా ఉండే నాయకులు ఎమ్మెల్యే కోసం పోటీ పడడంలో ఉన్న ఆసక్తి స్థానిక సమస్యలపై గురిపెట్టడం లేదనీ,హుజురాబాద్ అసెంబ్లీ నియోజవర్గ స్థానానికి ఏకంగా 10 నామినేషన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గాంధీభవన్లో అప్లికేషన్ చేసుకోవడం ద్వారా హుజురాబాద్ పై కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇన్ని సమస్యలున్న హుజురాబాద్ కాంగ్రెస్ లో పరిస్థితి మారుతుందో లేదా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన మారుతుందో వేచి చూడాలి. కింది స్థాయిలో ఉన్న క్యాడర్ మాత్రం కాంగ్రెస్ పార్టీని హుజురాబాద్ గడ్డపై ఎగరవేయాలని ఎంతో కోరికగా ఉన్నారు.వారి కోరిక నెరవేరుతుందో లేదో ఈ ఎన్నిక ద్వారా తేలిపోతుంది.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Rajendra

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts

భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు.. తప్పిన పెను ప్రమాదం

టీచర్స్ డే కానుకగా కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్