చల్లపల్లి యువకుడు, తైవాన్ యువతి ప్రేమ వివాహంతో ఒకటయ్యారు. ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించారు. గ్రామానికి చెందిన వేమూరి సాయి దినకర్ తైవాన్ దేశం సించూ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా స్థిరపడ్డాడు. అక్కడే ఫిజియో థెరపిస్టు యూటింగ్ లియూ అనే యువతిని ప్రేమించాడు. వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించారు. 2వ తేదీ వివాహం, 4వ తేదీ సోమవారం రిసెప్షన్ నిర్వహించారు.
