దేశంలో పేద ప్రజలకు వంట గ్యాస్ రూ.400లకే ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చొటుపల్లి రవి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈ మేరకు తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు చౌక ధరలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, రైతుల మెడకు కేంద్రం బిగించిన స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బండి ఆదిశేషు, జి.శ్రీనివాసరావు, డీ.అనసూయమ్మ, రవీంద్రబాబు పాల్గొన్నారు.
[zombify_post]