Khammam
———
*ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ..*
ఖమ్మం నగరం నెహ్రూ నగర్ నందు దండా పుల్లయ్య గారి అధ్వర్యంలో బంధుమిత్రుల తో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, పువ్వాడ నాగేశ్వర రావు గారు పాల్గొన్నారు.
*ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ కామెంట్స్:-*
ఓ ఓడిపోయిన వ్యక్తికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ని చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది
మాది గెలిచిన, ఓడిపోయిన ఖమ్మంతోనే మా అనుబంధం.
ఒక్కసారి ఖమ్మం వైపు చూసి మరోసారి మరో నియోజకవర్గం వైపు పోదాం అనే ఆలోచన మాది కాదు.
నేను ఇక్కడ భూమిపుత్రుడిని, మరోసారి ఆశీర్వదించండి.
సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి ఖమ్మంకు మంత్రి పదవి వచ్చినందుకే ఇంత అభివృద్ధి చేసుకున్నాం.
కొందరికి కడుపు నొప్పి వస్తే అందరికి కడుపు నొప్పి రావాలి అని కొందరు భావిస్తున్నారు.
అది వారి స్వార్ధ రాజకీయాల కోసం బలి పెడదాం అని అనుకుంటే మనం సిద్ధంగా లేము
సమయానుకూలంగా అందరికి అవకాశాలు రావాలి అని అనుకోవాలి.
యువకులు రాజకీయాలలోకి రావాలి అంటే మాకు అవకాశం ఇస్తేనే వస్తాం, కేసీఆర్ గారు కూడా ఇంకొక తరాన్ని తయారుచేశారు.
కొందరికి ఒక్కసారి అవకాశం ఇస్తే దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారు.
ఖమ్మం అభివృద్ధిలో ముందు ఉంది, దానిని వెనుకకు నెట్టాలి అని కొందరు కలలు కంటున్నారు.
రుమర్స్, గోబెల్ ప్రచారాల ద్వారా మనల్ని ఆగం చేయాలి అని చూస్తున్నారు వారి పట్ల తస్మాత్ జాగ్రత్త ఉందాం.
[zombify_post]