కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 29 ఆదివారం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి తెలిపారు. ఈ సమావేశంలో నవంబర్ 1 నుంచి 45 రోజుల పాటు జరిగే బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంతో పాటు పార్టీ మ్యానిఫెస్టో పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక రోటరీ క్లబ్ లో జరిగే ఈ సమావేశానికి పార్టీ క్లస్టర్ నాయకులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!