*దీపావళి కానుకగా 50% మధ్యంతర వృత్తి(ఐఆర్) ప్రకటించండి…ఎస్టీయూ*
*సీపీఎస్ వద్దు….జిపిఎస్ వద్దే వద్దు…..ఓపిఎస్ ముద్దు..ఎస్టీయూ*
నేడు ఆదోని పట్టణంలో ఉపాధ్యాయులు సభ్యత్వ నమోదులో భాగంగా ఉపాధ్యాయులకు ఎస్టీయూ సంఘ సభ్యత్వం ఇచ్చారు….ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు నాగరాజు,లోక్య నాయక్,వీరచంద్ర యాదవ్,రమేష్ నాయుడు మాట్లాడుతూ 12 వ పీఆర్సీ కమిటీ వేసి దాదాపు 4 నెలల అయిన నేటికి ఎలాంటి సమాచారం, సమావేశాలు లేవని కమిటీ రిపోర్ట్ ఆలస్యం అవుతుంది కావున వెంటనే దీపావళి కానుకగా 50% మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేసారు…అలాగే ఇచ్చిన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్,జిపిఎస్ విధానాలు కాకుండా పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు….ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు ప్రసాద్, గురురాజా,వీరేష్,నాగేంద్ర గౌడ్, రాముడు, శ్రీరాములు, గంగ నాయక్,జయరాం,వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఎస్టీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు…
This post was created with our nice and easy submission form. Create your post!