కొవ్వూరు పట్టణంలోని మెరక వీధిలో రౌండ్ రామాలయం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు, యువతీ,యువకుల నృత్యాలతో ఊరేగింపు ఉత్సవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!