గురు న్యూస్ విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం లో పాల్గొన్నరు,విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గౌ. శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు. ఈ సందర్బంగా వెంకోజీపాలెం, సీఎం ఆర్ ఫంక్షన్ హల్ లో నియోజకవర్గ 9,17,18,19 వార్డుల సచివాలయ జె సి ఎస్ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యి కార్యక్రమాన్ని ఉద్దేశించి అయన మాట్లాడుతూ, రానున్న 5,6నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యములో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే దిశగా 175/175 కు స్థానాలకు 175 స్థానాలు గెలవాలని తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలిచేదిశగా పయనించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, కనుక ఈ నెల 11వ తేదీ నుండి 20 తేది వరకు 40 రోజులు సచివాలయ పరిధిలో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్క సచివాలయ వాలంటీర్లు గృహశారదులు,కన్వీనర్లు సమిష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ లు తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికార పార్టీపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పేర్కొన్నారు. కనుక రానున్న ఎన్నికలలో మరల ఏపీ ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని గారిని గెలిపించే దిశగా ప్రతి ఒక్క గృహ సారధులు వాలంటీర్లు సచివాలయం కన్వీనర్లు సమిష్టిగా పనిచేయాలని ఎం. వి. వి సత్యనారాయణ పిలుపునిచ్చారు .
This post was created with our nice and easy submission form. Create your post!