డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
జలమే జీవంగా ఉన్న త్రాగునీటి వృధాను అరికట్టడంతో పాటుగా నీటి సం రక్షణ చర్యలు, పరిసరాల పరిశుభ్ర త పాటిస్తూ గ్రామాలను పరిశుభ్రం గా ఉంచుతూ సీజనల్ వైరల్ వ్యా ధులు ప్రబలకుండా మెళకువలు పాటించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా పంచాయితీ, గ్రామీణ నీటి సరఫరా మరి యు పారిశుద్ధ్య విభాగపు అధికారులను ఆదేశిం చారు. స్థానిక కలెక్టరే ట్లోని గోదావరి భవన్ నందు నిర్వ హించిన ప్రజా ఫిర్యాదు ల పరిష్కార వేదిక స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్ర మాలలో జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు లు పాల్గొని అర్జీ దారుల నుండి సుమారుగా 230 అర్జీలను స్వీకరిం చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందిన అర్జీలు సకా లంలో పూర్తిస్థాయిలో విచారించి నాణ్యతతో అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా అర్జీల పరిష్కార సరళి ఉండాలని ఆయన జిల్లా అధికారు లకు సూచించారు. ప్రస్తుత సీజన్లో అంటూ వ్యాధులు సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా గ్రామాలలో పారిశు ద్ధ్య కార్యక్రమాలు బలోపేతం చేయా లని అదేవిధంగా సురక్షిత త్రాగునీరు ను ప్రజలకు సరఫరా చేయాలని, సురక్షిత త్రాగునీటి సరఫరాలో వృధాను పూర్తిగా అరికట్టి సంరక్షణ చర్యలను బలోపేతం చేయాల న్నారు. సామాజిక భద్రత పింఛన్లు, నిత్యవసరాలు పంపిణీ, ఉద్యోగ అవకాశాలు కల్పన, రుణాలు కల్పన, రీ సర్వే, విద్య, వైద్యం, సాగునీటి సమస్యలు వివిధ ప్రభుత్వ శాఖలకు బ్యాంకుల సం బంధించిన తదితర సమస్యలపై దరఖాస్తులు అందాయన్నారు జిల్లాస్థాయి అధికారులు తమ లాగిన్ కు వచ్చిన అర్జీల పట్ల సత్వరమే స్పందించి క్షేత్రస్థాయిలో వాటిపై క్షుణ్ణంగా విచారణ చేసి నాణ్యతతో పరిష్కార మార్గాలు పూర్తిస్థాయిలో చూపాలన్నారు. గడువు దాటిన అర్జీలు లేకుండా, ఒకసారి సమర్పించిన దరఖాస్తు మరల అదే అంశంపై పునరావృతం కాకుండా మెలకువలు పాటించాలని జిల్లాస్థాయి అధికారులను ఆదేశిం చారు. ముమ్మిడివరం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి జె రాం బాబు త్రాగునీటి సంరక్షణ, పరిస రాల పరిశుభ్రత పై రూపొందించిన గేయానికి సంబంధించిన సిడిని ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరిం చారు. తొలుత పాత స్పందన హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు వైరల్ జ్వరాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగుల కొరకు వైద్య శిబిరాన్ని నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణ, భద్రతకై రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య స్థితిగతులపై రక్త పరీక్షల ఆధారంగా చికిత్సలను నిర్వహించారు..ఈ నెల 27వ తేదీ బుధవారం కాట్రేనికోన మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించ డం జరుగుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం దుర్గారావు దొర డి సి హెచ్ ఎస్ పద్మశ్రీ రాణి, డి ఆర్ డి ఎ పి డి వి శివశంకర్ ప్రసాద్ ,డ్వామా పిడి ఎస్ మధుసూదన్ గృహ నిర్మా ణ సంస్థ జిల్లా అధికారి సిహెచ్ బాబురావు సిపిఓ వెంకటేశ్వర్లు నోడల్ అధికారి కే భీమేశ్వరరావు పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎస్ సుధా సాగర్ డీఎస్ఓ ఏ పాపారా వు, జిల్లా వ్యవసాయ అధికారి కే నాగేశ్వర రావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం కమల కుమారి, కార్మిక శాఖ సహా య కమిషనర్ టీ నాగ లక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సాధికారత అధికారిని పి జ్యోతిలక్ష్మి దేవి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కె ప్రభాకరరావు, పంచాయి తీరాజ్ ఎస్సీ కే చంటిబాబు, మత్స్యశాఖ జేడీ ఫేక్ లాల్ మహ మ్మద్, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణారావు మార్కెటింగ్ శాఖ ఏడి కె విశాలాక్షి వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
