తునికాకు సేకరించిన కార్మికులందరికీ పెండింగ్ లో ఉన్న బోనస్ విడుదల చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల అటవీశాఖ కార్యాలయం ఎదుట సిపిఎం దుమ్ముగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వ్య.కా.సం జిల్లా నాయకులు మర్మం చంద్రయ్య మాట్లాడుతూ 2016 నుండి 2021 వరకూ తునికాకు సేకరించిన బట్టిగూడెంకు చెందిన 60 మంది కార్మికులకు బోనస్ డబ్బులు జమ కాలేదని తక్షణమే పెండింగ్లో ఉన్న బోనస్ నగదును జమ చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన,పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
[zombify_post]