సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. త్రివర్ణ పతాకం రంగులతో వేదికను తీర్చిదిద్దారు.శనివారం సాయంత్రం జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్, ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య, డీపీఆర్ఓ దశరథం ల తో కలిసి ఐడిఓసి లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, తేదీ.17-9-23, ఆదివారం, ఉదయం 9. గంటలకు ఐ డి ఓ సి లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారని,
అనంతరం గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, చైర్మన్ లు స్వతంత్ర సమరయోధులు, పుర ప్రముఖులు, తదితరులు హాజరవుతారన్నారనీ తెలిపారు.అందుకు తగిన విధంగా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. విఐపి, మీడియా ప్రతినిధులు, ప్రజలకు వేరు వేరు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
[zombify_post]