- పాడేరు సెప్టెంబరు 16 : పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిపైనా ఉందని ఐటిడిఏ పిఓ వి. అభిషేక్ అన్నారు. స్థానిక కెజిబివి పాఠశాలలో కాలుష్య నియంత్రణ మండలి, సాక్షి దిన పత్రిక సంయుక్తంగా నిర్వహించిన మట్టి వినాయ ప్రతిమలు తయారీ పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక పదార్దాలలో వినాయక విగ్రహాలు తయారు చేయడం వలన నీటి కాలుష్య పెరిగి జల చరాలకు హాని కలుగుతుందన్నారు. మట్టి వినాయక ప్రతిమలు తయారీపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 1500 వందల సంవత్సరాల నుండి భారత దేశంలో వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్నారని స్పష్టం చేసారు. లోకమాన్య తిలక్ 1896 సంవత్సరంలో స్వాతంత్య్ర పోరాటానికి నడుస్తున్న సమయంలో ప్రజలను ముందుకు తీసుకుని వచ్చి మహారాష్ట్ర రాష్ట్రంలో ఇంటి లోపల జరుపుకునే వినాయక చతుర్ధిన బయట చేసుకునే విధంగా ప్రజలను ఐక్యంగా ఉండేలలా చైతన్యవంతం చేసి ఉత్సవాను నిర్వహించారని చెప్పారు. వినాయక చతుర్ధి స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిందన్నారు.1990లో మట్టి వినాయక విగ్రహాలు తగ్గి రసానిక పధార్ధాలతో విగ్రహాలు తయారు చేయడం మొదలు పెట్టారని చెప్పారు. మద్రాసులో విగ్రహాల నిమజ్జనంలో చెరువులలో మత్స్య సంపద మృత్యు వాత పడటంతో కొంత మంది కోర్టుకు వెళ్లడంతో రసాయనాలతో విగ్రహాలు తయారు చేయకూడదని మద్రాసు కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కాబట్టి అందరూ మట్టి విగ్రహాలు వినాయక చవితిలో వినియోగించాలని సూచించారు. వినాయ ప్రతిమల తయారీ పోటీలలో కెజిబివి విద్యార్దులు మొదటి బహుమతి, అక్షర పాఠశాల విద్యార్దులు ద్వితీయ బహుమతి, లోచలిపుట్టు నెం.1 పాఠశాల విద్యార్దులు తృతీయ బహుమతులను సొంతం చేసుకున్నారు. గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాల,శ్రీకృష్ణాపురం ఆశ్రమ బాలికల ఆశ్రమ పాఠశాల, లోచలిపుట్టు ఆశ్రమ పాఠశాల, కెజిబివి పాఠశాల , అక్షర పాఠశాల, మోదమాంబ పాఠశాల విద్యార్దులకు కన్సోలేషన్ బహుమతులను అందజేసారు.
ఈ కార్యక్రమంలో సహాయ గిరిజన సంక్షేమాధికారి ఎల్.రజని,హుకుంపేట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సింహాచలం నాయుడు, పాడేరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, డిటిడి ఓ కె. సూర్యకుమారి, స్పెషల్ ఆఫీసర్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]